అద్భుతంగా ముందుకు సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్..

77
Green India Challenge

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బోయినపల్లి మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపెల్లి లక్ష్మి రాములు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ చైర్మన్ లక్ష్మి రాములు నాకు ఛాలెంజ్ విసిరారు అందులో భాగంగా ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలలు తెలుపుతున్నాను అని అనిల్‌ తెలిపారు.