ఏపీలో కొత్తగా 500 మందికి కరోనా పాజిటివ్‌..

53
corona

ఆంధ్రపదేశ్‌లో గడచిన 24 గంటల్లో 61,452 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 500 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 88 కేసులు రాగా, కృష్ణా జిల్లాలో 77, పశ్చిమ గోదావరి జిల్లాలో 63, గుంటూరు జిల్లాలో 55 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని కరోనా వ్యాప్తికి సంబంధించిన తాజా బులెటిన్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

మొత్తంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336కి పెరిగింది. అదే సమయంలో 563 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 7,064కి చేరింది. ఇప్పటివరకు 8,64,612 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,660 మందికి చికిత్స కొనసాగుతోంది.