మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తేలిపోయింది. ఉప ఎన్నికల ప్రచారంలో చిత్రవిచిత్రాలకు పాల్పడిన బీజేపీ తాజాగా గోబెల్స్ ప్రచారానికి తెరలేపింది. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఫేక్ ప్రచారం చేసి లబ్ది పొందినట్టుగానే మునుగోడులోనూ సేమ్ స్ట్రాటజీని ఫాలోయింది.
కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి…సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారని…అర్ధగంటపాటు ఈ భేటీ సాగిందని మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. వాస్తవానికి ఆ ఫోటో ఎన్నికల ప్రచారం సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో స్రవంతి దిగిన ఫోటో. దానిని మార్ఫింగ్ చేసి వెంకట్ రెడ్డి స్ధానంలో సీఎం కేసీఆర్ ఫోటోను జోడించి లబ్ది పొందేందుకు కుయుక్తులు పన్నింది. అయితే వెంటనే అలర్ట్ అయిన టీఆర్ఎస్ శ్రేణులు దీనిని ఖండిస్తూ ఒరిజినల్ ఫోటోను రిలీజ్ చేశారు.
ఇక అలాగే మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నారని ఇందులో భాగంగా ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారని మరో ఫోటోను సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి వాడింది. అయితే ఇది రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కర్నె ప్రభాకర్‌తో దిగిన ఫోటో. ఈ వార్తపై కర్నె ప్రభాకర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. బీజేపీ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డేనని తెలిపారు. ఇక నెటిజన్లు సైతం బీజేపీ కుయుక్తులను ఎండగడుతున్నారు.
మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం కావడంతో ప్రజలను గందరగోళ పరచడానికి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లను వ్యాప్తిచేస్తోందని మండిపడుతున్నారు.ఈ దుర్మార్గపు బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉందాం… తెలంగాణ నుంచి తరిమికొడదాం అని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..