గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాట శ్రీనివాస్ గౌడ్

26
- Advertisement -

సంగారెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతపోరు మరోసారి బహిర్గతమైంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

సేవ్ పటాన్‌చెరు స్లోగన్‌తో స్థానిక కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న కుర్చీలను పగలకొట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గం కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

Also Read:తెలంగాణలో రూ.56 వేల కోట్ల పెట్టుబడులు

- Advertisement -