మునుగోడు ఉప ఎన్నికల కోసం గత నెల రోజులుగా పార్టీ కోసం శ్రమించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.పార్టీ ఆదేశాల మేరకు తమ తమ ప్రాంతాల నుంచి వచ్చి, మునుగోడులో పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇన్చార్జీలకి, వారితో వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన వామపక్ష నాయకులకు, కార్యకర్తలకు మనః పూర్వక కృతజ్ఞతలు చెప్పారు కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయడంతో పాటు , ప్రత్యర్ధి పార్టీల కుట్రలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన సోషల్ మీడియా వారియర్లకు పార్టీ తరపున ధన్యవాదాలు చెప్పారు.
ఇవి కూడా చదవండి..

