ఎంపీ కోమటిరెడ్డికి కరోనా పాజిటివ్‌…

55
komatireddy

దేశంలో,రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతుండగా ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారీనపడ్డారు.

తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరోనా బారీన పడ్డారు. రీసెంట్ గా ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన నేతలు, నాయకులు, ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.