రాజశేఖర్ ఆరోగ్యంపై వదంతులు నమ్మకండి:శివాత్మిక

193
shivathmika
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా బారీన పడి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కోలుకోగా కరోనాతో చికిత్స పొందుతున్న హీరో రాజశేఖర్ పరిస్ధితి ఆందోళన కరంగా ఉంది.

ఈ నెల 17న రాజశేఖర్ దంపతులకు కరోనా పాజిటివ్ రాగా జీవిత హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది.

నిన్న రాత్రి నుంచి రాజశేఖర్ కు శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కూతురు శివాత్మిక చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కరోనా తో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బందులు పడుతున్నారని, అందరి అభిమానంతో నాన్న క్షేమంగా తిరిగివస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తన ట్విట్టర్ లో కోరారు. దయచేసి తప్పుడు ప్రచారం చేయోద్దని ట్విట్టర్ ద్వారా కోరారు.

- Advertisement -