నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ పనైపోయిందా?

43
- Advertisement -

కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండే నియోజక వర్గాల్లో నల్గొండ కూడా ఒకటి. ఇక్కడ 1999 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తరుపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందుతూ వచ్చారు. కానీ గత ఎన్నికల్లో అనూహ్యంగా బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపొందారు. 23 వేల ఓట్ల తేడాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ స్థాయిలో బి‌ఆర్‌ఎస్ విజయం సాధించడానికి కారణం కూడా లేకపోలేదు. బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ అందిస్తున్న సుపరిపాలన ఒక కారణం అయితే.. జిల్లాలో కోమటిరెడ్డి హవా తగ్గడం మరో కారణం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ గత కొన్నాళ్లుగా తిరుగులేని నాయకులుగా వెలుగొందుతూ వచ్చారు..

కానీ ఈ మద్య కాలంలో వారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ బి‌ఆర్‌ఎస్ తొమ్మిది స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ మాత్రం 3 స్థానాలకే పరిమితం అయింది. నల్గొండలో పట్టున కోమటిరెడ్డి వెంటక రెడ్డి ఓటమిపాలు కావడం, ఇక మునుగోడులో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఆ తరువాత బీజేపీలో చేరి బై ఎలక్షన్స్ లో ఓటమి చవి చూడడం చక చక జరిగిపోయాయి. ఇప్పుడు జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా పూర్తిగా తగ్గిపోయినట్లే తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరు బ్రదర్స్ గతంలో పోటీ చేసిన స్థానం నుంచే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంటకారెడ్డి బరిలోకి దిగితే, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. నల్గొండ నుంచి బి‌ఆర్‌ఎస్ తరుపున గత ఎన్నికల్లో గెలిచిన కంచర్ల భూపాల్ రెడ్డిని మళ్ళీ బరిలోకి దిగనున్నారు. దాంతో ఈసారి కూడా వెంకటరెడ్డికి గెలుపు కష్టమే అనే వాదన వినిపిస్తోంది. అటు మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి పోటీగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. బైపోల్ లో రాజగోపాల్ రెడ్డిని ఘోరంగా ఓడించిన ఆయన ఈసారి కూడా రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎటు చూసిన నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ పనైపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Also Read:ఈ ఆసనాలు వేస్తే.. మతిమరుపు దూరం!

- Advertisement -