పార్టీలో కోమటిరెడ్డి ” కరివేపాకు ” పాత్ర ?

16
- Advertisement -

సాధారణంగా కూరలో కరివేపాకును సువాసన కోసం ఉపయోగించిన తినే సమయంలో దానిని తీసి పక్కన పెడుతుంటాం. అందుకేనేమో ఉపయోగం లేని వారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూరలో కరివేపాకు పాత్ర అంటూ ఉంటాము. అంటే వారివల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది దాని తాత్పర్యం. ఇదంతా ఎందుకంటారా ! ప్రస్తుతం టి కాంగ్రెస్ లో ఒకరి పరిస్థితి ఇలాగే ఉంది. పార్టీ అధిస్థానం గాని, పార్టీలోని ఇతర నేతలు గాని ఆయనను కూరలో కరివేపాకు లాగే చూస్తున్నారట. ఎవరి గురించి అంటారా ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఎవరనేది ఆయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో తన ప్రమేయం లేనిదే ఎవరికి సీట్ల కేటాయింపు జరగదని, ఎవరెవరికి సీటు ఇవ్వాలనేది తను మాత్రమే నిర్ణయిస్తానని.. ఇలా కోతలు కోస్తున్న ఆయనను హాస్యాస్పదంగా అధిస్థానం పక్కన పెట్టేస్తోంది. .

దీంతో కోమటిరెడ్డిని హస్తం హైకమాండ్ జోకర్ లా భావిస్తోందా అనే భావనా రకమానదు. మునుగోడు బైపోల్ సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరని ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది అధిస్థానం. ఆ టైమ్ లో ఆయన పార్టీలో ఉంటారా ఉండరా అనే సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తమయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని ముందుగానే గుర్తించిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే చెప్పాలి. దీంతో సొంత పార్టీనేతలే కోమటిరెడ్డిపై అగ్గిమీద గుగ్గిలం అవుతూ వచ్చారు. అసలే పార్టీ బలం అంతతమాత్రంగానే ఉంటే మళ్ళీ సొంత నేతలే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుండడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అసలు పట్టించుకోవడమే మానేసింది అధిష్టానం.

ఆ తరువాత కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తిరిగి యాక్టివ్ అయిన వెంకటరెడ్డి.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని అందుకోసం అంతా తానై నడిపిస్తున్న వ్యక్తిగా హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారనే భావనా పార్టీ నేతల్లో గట్టిగానే ఉందట. ఈ నేపథ్యంలో ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఏ కమిటీలోనూ కోమటిరెడ్డికి స్థానం కల్పించలేదు. పార్టీని విడతారేనే గుసగుసలు వీనిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారికి రాష్ట్ర ఎన్నికల కమిటీలోనూ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ చోటు కల్పించిన అధిష్టానం, కోమటిరెడ్డికి మాత్రం ఏ పదవి కట్టబెట్టకుండా పక్కన పెట్టేసింది. దీంతో మరోసారి ఆయన అధిష్టానంపై అలక పూనారు. తనకు ప్రదాన్యం దక్కడం లేదని వాపోతున్నారు. మరి హస్తమ్ హైకమాండ్ ముందు రోజుల్లోనైనా కోమటిరెడ్డికి ఏదో ఒక పదవి కట్టబెడుతుందా లేదా ఆయనను కరివేపాకు మరిదిగానే చూస్తుందా అనేది చూడాలి.

Also Read:ఆ ఇద్దరితో ‘బేబీ’ బ్యూటీ రొమాన్స్

- Advertisement -