నటిగా మారిన షమి భార్య.. ఫోటో షూట్ చూశారా..!

206
cricketer-mohammed-shami-his-wife-hasin-jahan

టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీపై ఆయన భార్య హసీన్, గృహ హింస, అత్యాచారం వంటి ఆరోపణలు చేసి, కేసులు పెట్టిన విషయం తెలిసిందే. గతకొంత కాలం నుంచి కోర్టులో షమీపై న్యాయపోరాటం చేస్తోంది. తనకు రావాల్సిన భరణం వచ్చేంత వరకు న్యాయబద్దంగా పోరాడతానని తెలిపింది. తాజాగా ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఐపీఎల్ చీర్ గర్ల్ అయిన హసీన్.. మాజీ మోడల్ కూడా.

అంజద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫత్వా సినిమాలో నటించనుంది. ఇందులో ఓ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. తన కుటుంబాన్ని పోషించుకోవడానికే తను సినిమాలలో నటిస్తున్నానని తెలిపింది. ఈ సందర్భంగా అంజద్ ని కలిసి.. ఆయన సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని పేర్కొన్నారు.