అక్టోబ‌ర్ 18న విశాల్ ‘పందెం కోడి2’..

272
vishal
- Advertisement -

త‌మిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అత‌ను న‌టించిన ప్ర‌తి సినిమా త‌మిళ్ , తెలుగులో విడుద‌ల‌వుతాయి. త‌న యాక్టింగ్ తో తెలుగులో కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు విశాల్. సినిమాల్లో న‌టించ‌డ‌మే కాకుండా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో కూడా విశాల్ ముందుంటాడ‌ని మ‌న‌కు తెలిసిందే. విశాల్ ఇటివ‌లే న‌టించిన అభిమ‌న్యుడు సినిమా త‌మిళ్ , తెలుగులో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

vishal

విశాల్ హీరోగా త్వ‌రలో రాబోతున్న మూవీ పందెంకోడి2. ప్ర‌స్తుతం ఈసినిమా చిత్రిక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. గ‌తంలో విశాల్ హీరోగా చేసిన పందెంకోడి సినిమా ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈమూవీకి ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌డు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈసినిమాలో విశాల్ స‌ర‌స‌న హీరోయిన్ గా కీర్తి సురేష్ న‌టించింది.

vishal

అయితే ఈచిత్రాన్ని దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నే చేయనున్న‌ట్లు తెలుస్తుంది. దీపావ‌ళి కానుక‌గా అక్టొబ‌ర్ 18వ తేదిన ఈమూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈచిత్రానికి విశాల్ త‌న సొంత బ్యాన‌ర్ లోనే నిర్మించారు. అయితే దీపావ‌ళికి సూర్య‌, విజయ్ న‌టించిన సినిమాలు కూడా విడుద‌ల అవుతుండ‌టంతో బాక్సాఫిస్ వ‌ద్ద ముగ్గ‌రు హీరోలు త‌మ సత్తాను చాటుకొనున్నారు.

- Advertisement -