హృతిక్.. వినూత్న వీడియో వైరల్..

200
Hrithik Roshan And Sons Holiday tour Enjoy

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన కుమారులతో కలిసి విహారయాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్ లో విహరిస్తున్న ఆయన శాంటోరిలోని తన కుమారులు హృదాన్‌, హృహాన్‌లతో కలిసి సముద్రంలో స్విమ్ చేస్తున్న వీడియోని పోస్టు చేశారు. అయితే వీడియో వేరే గ్రహం నుంచి తీసిన వీడియోలా ఉంది. ప్రపంచానికి ఎత్తులో ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. చాలా మంది డ్రోన్ తో తీసి ఉంటారని భావిస్తున్నారు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు చేసిన హృతిక్ ‘జస్ట్‌ చిల్లింగ్’ ఈ వీడియో డ్రోన్ తో తీయలేదు అని క్యాప్షన్ కూడా పెట్టాడు.

Hrithik Roshan  And Sons Holiday tour

ఈ వినూత్న వీడియోని హృతిక్ ఎలా తీశాడని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వినూత్న వీడియోని మీరు ఒక సారి వీక్షించండి.. ఎలా తీసి ఉంటాడో ఊహించండి చూద్దాం.

ప్రస్తుతం వికాస్ బెహెల్ దర్శకత్వంలో సూపర్ 30 సినిమా చేస్తున్నారు ఈ బాలీవుడ్ హీరో. 2019 జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బీహార్ కి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ సుమార్ రూపొందించిన ‘సూపర్ 30’ ప్రోగ్రామ్ ఆధారంగా ఈ రూపొందుతుంది.