హెల్త్‌ హబ్‌గా వారణాసి…

230
PM Modi

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్భంగా వారణాసిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండోరోజు పర్యటనలో భాగంగా వారణాసిపై వరాల జల్లు కురిపించారు మోడీ. రూ. 550 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు.

హర్ హర్ మహదేవ్ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోడీ.. నేను మీ కొడుకుని అని అన్నారు. 50 నిమిషాల ప్రసంగంలో మోదీ చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. సానుకూల మార్పులు చేస్తూనే ఘనమైన వారణాసి వారసత్వాన్ని నిలబెడుతున్నామని చెప్పారు. వారణాసిలోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ రోడ్లు,నీళ్లు,కరెంట్ సరఫరా మెరుగుపడిందని తెలిపారు.

Image result for modi varanasi

గతంలో వారణాసిలో పరిస్థితులు దైవాధీనం అన్నట్లుగా ఉండేవని కానీ నేడు ఇప్పుడు మారుతున్నాయని చెప్పారు. కాశీలో ఎక్కడ చూసినా కరెంటు వైర్లు వేలాడుతూ కనిపించేవని, ఇప్పుడు చాలా వరకు మాయమయ్యాయని, పూర్తిగా అండర్‌గ్రౌండ్ వైరింగ్ చేస్తున్నామని మోదీ చెప్పారు. వారణాసి హెల్త్ హబ్‌గా మారనుందని అన్నారు.