KTR:బీజేపీకి సున్నా సీట్లే

22
- Advertisement -

తెలంగాణలో బీజేపీ ఈసారి ఖాతా కూడ తెరవదని…ఆపార్టీకి వచ్చేవి సున్నా సీట్లేనని తెలిపారు మంత్రి కేటీఆర్.ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్బాటంగా మోడీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు.

2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై అప్పటి యూఏపీ ప్రభుత్వం వివక్షను నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో యువకులు వందల సంఖ్యలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అవి కాంగ్రెస్‌ పాప ఫలితం. తెలంగాణకు ఇప్పుడేం కావాలి? తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఇక్కడ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రైతులకు నీళ్లు ఉంటే మట్టిలో బంగారం పండిస్తరన్నారు.

పదేండ్ల పాలనలో పాలమూరును పట్టించుకోకుండా నిద్రపోయారా అని యూపీఏ ప్రభుత్వాన్ని మోదీ నిలదీశారని.. మహబూబ్‌నగర్‌పై బీజేపీ ఉదాసీనత చూపించి ఇప్పుడు మరో పదేండ్లు గడిచిపోయాయని అన్నారు. ఈ పదేండ్లలో మీరు అందించిన సాయం సున్నా అని చురకలంటించారు. మోదీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని పేర్కొన్నారు.

Also Read:‘ఉస్తాద్ భగత్ సింగ్’..షెడ్యూల్ పూర్తి

- Advertisement -