దాసరి బర్త్‌ డే…డైరెక్టర్ డే

480
dasari
- Advertisement -

భజనలు చేయకుండా ఉన్నది ఉన్నట్లు ముక్కసూటిగా మాట్లాడే మనిషి దాసరి నారాయణరావు. ఆయన విమర్శించదలుచుకున్న మనిషి ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టరు. ఎవరినైనా పబ్లిక్ గా విమర్శించేస్తారు. అలుపెరుగని సినీ కార్మికుడిగా…టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దాసరి పుట్టినరోజు నేడు. అనారోగ్య కారణాలతో దాసరి మననుంచి దూరమైన ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. అజరామరం.

ఆయన పుట్టినరోజును డైరెక్టర్స్‌ డే ప్రకటించిన టాలీవుడ్‌ని ఆయన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా సినీ రంగంలో విశేష ప్రతిభను కనబర్చిన వారిని సన్మానించుకునేందుకు సిద్ధమైంది.అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ బుక్ లో చోటుసంపాదించారు దాసరి. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఓ సువర్ణాధ్యాయం. బహుముఖ ప్రజ్ఞాశాలి.. తెలుగు సినిమాకు ఆయన అందించిన విజయాలను వర్ణించడం అసాధ్యం. ఎందరినో స్టార్ హీరోలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది.

ఎన్టీఆర్‌,ఏఎన్నాఆర్,కృష్ణంరాజు,కృష్ణ,శోభన్ బాబు లాంటి అగ్రహీరోలకు తమ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ సినిమాలు ఇచ్చిన దర్శకుడు దాసరి. తాతా మనవడు నుంచి మొన్నటి `ఎర్ర బస్సు` వరకూ ఎన్నో విజయాలను అందుకున్నారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. 250 పైగా చిత్రాలకు రచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవారు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు. దాసరి సినిమాలు `తాతా మనవడు`, `స్వర్గం నరకం`, `మేఘసందేశం`, `మామగారు` అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి.

దాసరి తిసిన `బొబ్బిలి పులి` `సర్దార్ పాపారాయుడు` చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి. `మామగారు`, `సూరిగాడు`, `ఒసేయ్ రాములమ్మా` చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో దాసరి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డులు కూడా లభించాయి. అలాగే జాతీయ ఆయన మరెన్నో అవార్డులు అందుకున్నారు.

- Advertisement -