భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

38
mlc kavitha

ఛార్మినార్ వద్ద భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,గత ఏడాది నుండి ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా‌ మహమ్మారి పీడ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని కోరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో భోగి మంటల‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటామన్న ఎమ్మెల్సీ కవిత… జీవితంలో చెడును పారద్రోలి, మంచిని కోరుకునే గొప్ప సాంప్రదాయం మనదన్నారు.

సంక్రాంతి పండుగ ద్వారా అందరికీ శుభం కలగాలని, దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ఛాయ్ కేఫ్ కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, స్థానికులతో కలిసి టీ తాగారు.