ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరోనా..

29
mlc jeevan reddy

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత రెండు రోజలు నుండి జ్వరంగా ఉండడంతో ఆయన సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌ రావడంతో హోం ఐసోలేషన్‌ లోకి వెళ్లారు జీవన్‌ రెడ్డి. అంతేకాదు.. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని జీవన్‌ రెడ్డి సూచించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యలో ఎవరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.