ఆక‌ట్టుకుంటున్న అజయ్‌ దేవ్‌గణ్‌ ‘భుజ్’ ట్రైల‌ర్..

21

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘భుజ్‌’ (ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా)’. సంజయ్‌ దత్‌, నటి సోనాక్షి సిన్హా, ప్రణీత కీలక పాత్రలు పోషించారు. 1971 భారత్‌ – పాకిస్థాన్‌ యుద్దం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. యుద్ధ సమయంలో గుజరాత్‌లోని ‘భుజ్‌’ ఎయిర్‌బేస్‌ ఎలా విధ్వంసానికి గురైంది? ఆ సమయంలో ఆ విమానాశ్రయానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఐఏఎఫ్‌ స్వ్కాడ్రన్‌ నాయకుడు విజయ్‌ కార్నిక్‌ చేసిన పోరాటం ఏమిటి? అన్న ఇతివృత్తంతో అభిషేక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

దేశ‌భ‌క్తి, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో భుజ్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.. ఇండో-పాక్ యుద్ధం స‌మ‌యంలో బుజ్ ఎయిర్‌బేస్‌కు స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌గా విజ‌య్ ఉంటారు. ఆ పాత్ర‌ను దేవ‌గ‌న్ పోషించాడు. ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్ ఆర్మీ స్కౌట్ రాంచోడ్‌దాస్ ప‌గి పాత్ర‌ను పోషిస్తున్నాడు. 3.20 నిమిషాల ట్రైల‌ర్ మొత్తం యాక్ష‌న్ సీన్ల‌తో నిండిపోయింది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఆగ‌స్టు 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Bhuj: The Pride Of India - Official Trailer | Ajay D. Sonakshi S. Sanjay D. Ammy V.Nora F | 13th Aug