బుద్ది జ్ఞానం ఉందా.. అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం..

33

నేను మీ ఇంటి బిడ్డను.. మీ గ్రామంలో అభివృద్ధి కోసం పాలేరుగా అయినా పనిచేస్తాను అంటూ టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ, మధనపురం, గాజులగట్టు గ్రామాలలో.. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. 60 యేండ్ల పాలనలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మండలంలోని దాదాపు 25 మంది అధికారులతో వచ్చామని.. అన్ని సమస్యలను పరిష్కారం చేద్దామన్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ, విద్యుత్ అధికారులపై ఎమ్మెల్యే విరుచుకపడ్డాడు. స్థానిక ప్రజల సమస్యలపై స్పందించడం లేదు అంటూ అధికారులకు చుక్కలు చూపించాడు. బుద్ది జ్ఞానం ఉందా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.