తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు మురళి మోహన్..

39

ఆదివారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్, మాజీ ఎంపీలు మురళి మోహన్, కంభంపాటి రామ్మోహన్‌లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.