కేటీఆర్ పెళ్లి రోజు…గ్రీన్ ఛాలెంజ్

40
ktr

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌. బోయిన‌ప‌ల్లి మండ‌లం కొదురుపాక మ‌ధ్య‌మానేరు జ‌లాశ‌యం బ్రిడ్జి వ‌ద్ద ఎమ్మెల్యే ర‌విశంక‌ర్ 300 మొక్క‌లు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రవిశంకర్…కేటీఆర్ దంప‌తుల‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ మొక్క‌లు నాటామ‌ని చెప్పారు. కేటీఆర్ భ‌విష్య‌త్‌లో ఎన్నో ఉన్న‌త ప‌ద‌వులు పొందాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల కంటే ప్రజలతో మమేక‌మ‌య్యే నాయకుడు త‌మ‌కు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామ‌ని ఎమ్మెల్యే ర‌విశంక‌ర్ స్ప‌ష్టం చేశారు.

సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో పాటు హ‌రిత తెలంగాణ కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే కేటీఆర్ పెళ్లిరోజు సంద‌ర్భంగా పెద్ద ఎత్తున మొక్క‌లు నాటామ‌ని తెలిపారు.