జర్నలిస్టులకు అండగా నిలిచింది..కేసీఆర్ సర్కారే: నిరంజన్ రెడ్డి

47
niranjan reddy

జర్నలిస్టులకు అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా కొత్తకోటలో మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందజేశారు నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…బీమాతో జర్నలిస్టులకు భరోసా లభిస్తుందన్నారు.

గతంలో జర్నలిస్టులు మరణిస్తే పట్టించుకున్న పాలకులు లేరు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రెస్ అకాడమీతో పాటు, కార్మిక విభాగం కింద బీమా చేయించి వారి కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.కరోనా విపత్తులో వైరస్ బారిన పడిన ప్రతి జర్నలిస్టుకు రూ.20 వేలు అందించామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దయ్యాల దాసు, జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, గట్టు యాదవ్, శ్రీధర్, కొళ్ల వెంకటేష్, టీఆర్‌ఎస్‌వీ ఆటో యునియన్ అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.