జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామరక్ష- మంత్రి వేముల

160
Minister Prashanth Reddy
- Advertisement -

కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై నిజామాబాద్ జిల్లా అధికారులతో శనివారం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ..టెస్టులు, చికిత్సలు, అవగాహన, వ్యాక్సినేషన్‌తో ప్రజలకు కోవిడ్‌పై రిలీఫ్‌కు చర్యలు తీసుకోవాలి. అలాగే మందులు, ఆక్సిజన్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ అవసరం లేకుండానే ప్రజలు జాగ్రత్తతో మాస్కులు ధరించి, చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా కోవిడ్ దరిచేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో మొత్తం 2100 బెడ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామరక్ష అని మంత్రి తెలిపారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డివోలు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -