ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని..

140
talasani

గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమానికి విశేష స్పందనవస్తోంది. పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొంటుండగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 స్టోన్ వాలి అపార్ట్‌మెంట్స్ లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ,ఎమ్మెల్యేలు దానం నాగేందర్,బిగాల గణేశ్ గుప్తా.

హైదరాబాద్ – ఉమ్మడి రంగారెడ్డి – మహబూబ్ నగర్ మరియు ఉమ్మడి ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఓటు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.

ఓటు నమోదుకు కావాల్సిన అర్హతలు..

-2017 కంటే ముందు డిగ్రీ/ ఇంజనీరింగ్ పాస్ అయిన గ్రాడ్యుయేట్లు

కావాల్సిన పత్రాలు..

-పాసైన డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్/ మార్కుల మెమో
-(గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించిన జిరాక్స్ కాపీ)
-ఓటర్ ఐడి కార్డు
-పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
-మొబైల్ నెంబర్
-నింపిన ఫారంలను ఎమ్మార్వో / డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఇవ్వాలి.
-ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు