కార్తీక దీపం మిస్సయ్యాం!

168
karthika deepam

హైదరాబాద్‌లోని బోరబండలో శుక్రవారం రాత్రి భూమి కంపించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా రాత్రంతా జాగారం చేశారు. భారీ శబ్దాలు రావడంతో ప్రజలకు ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించ లేదు.

ప్రధానంగా వీకర్స్‌ కాలనీ సైట్‌ 3 నుంచి శుక్రవారం రాత్రి భారీ శబ్దాలు వినిపించాయి. ఓ వైపు శబ్దాలు భయాందోళనకు గురిచేస్తుంటే మరికొంతమంది మహిళలు రాత్రి కార్తీక దీపం సీరియల్ చూడలేదని నిరాశచెందారు. ఇవాళ్టి సీరియల్ ఏమై ఉంటుందా అని కొంతమంది మహిళలు నిరాశ చెందడం కనిపించింది.

కొంత మంది భయంతో ఇళ్లకు తాళం వేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక, రాత్రంతా ఇళ్ల బయటే గడిపిన ప్రజలు.. ఉదయం ఇళ్లలోకి పోయే ప్రయత్నాలు చేశారు.

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. ఇప్పటివరకు 848 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా వంటలక్క ఎంతగానో పాపులర్. కార్తీక్‌.. మౌనిత మాటలతో ఇప్పుడు.. సౌందర్య, దీపలు నిజం చెప్పినా నమ్మకుండా అసహించుకునే స్థాయికి మారిపోయాడు. మరి ఇప్పడు దీప, సౌందర్యలు ఏం చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.