భూములు కోల్పోయిన పేదలకు న్యాయం చేస్తాం- మంత్రి

159
minister malla reddy
- Advertisement -

శుక్రవారం ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి పనులను పునఃప్రారంభమైయ్యాయి. గత కొంతకాలంగా ఆగివున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనుల కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎంత త్వరగా విలులైతే అంత త్వరగా బ్రిడ్జి పనులను పూర్తి చేస్తాం. అలాగే బ్రిడ్జి క్రింద భూములు కోల్పోయిన పేదలకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్లైఓవర్‌ వంతెన నిర్మాణ సమయంలో స్థలాలు నష్టపోయిన బాధితులకు సరైన న్యాయం జరుగక పోవడంతో కొంత మంది కోర్టుకు వెళ్లడంతో ఈ పనులు నిలిచి పోయాయని మంత్రి అన్నారు.

ప్రస్తుతం బాధితులకు స్థలంతో పాటు, కొంత మొత్తాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుందని, దీనికి బాధితులు అంగీకారం తెలుపడంతో నిర్మాణ పనులు ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయితే కొండాపూర్‌, కీసర, శామీర్‌పేట్‌, మేడ్చల్‌ వరకు వెళ్లే వాహన దారులకు సౌకర్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -