మల్లు..టిల్లు మాస్ డ్యాన్స్‌

67
- Advertisement -

మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా అది సెన్సేషనే. మాటలైనా, డ్యాన్స్‌ అయినా విమర్శలు చేయడంలోనైనా మల్లారెడ్డి తీరే సపరేటు. తాజాగా మరోసారి అలాంటిదే చేసి వార్తల్లో నిలిచారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో డ్యాన్స్‌ చేసి అలరించారు.

సినీ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. డీజే టిల్లుతో కలిసి స్టేజీ దద్దరిల్లేలా స్టెప్పులేసి కుర్రకారును ఉర్రుతలూగించారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్యమ్రంలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

సంబరాల్లో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఒకే ప్రాంగణంలో దాదాపు 40 వేల విద్యార్థినులతో సంబురాలు నిర్వహించారు. ఇంత మంది విద్యార్థులతో ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు ఇండియన్ బుక్ అఫ్ రికార్డులో చోటు దక్కింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -