ఆమోస్ మృతి పట్ల సంతాపం తెలిపిన సత్యవతి..

224
minister satyavathi

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ మృతి పట్ల రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ఉద్యమం నుంచి మలి ఉద్యమం వరకు రాష్ట్ర సాధనకు ఆయన చేసిన పోరాటం మరవ లేనిదని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆమోస్ గారి మృతి తెలంగాణకి తీరని లోటన్నారు.

ఆమోస్ గారి కుటుంబ సభ్యులకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్థించారు. అలాగే ఎం.పి కేశవరావు , చుక్కా రామయ్య , స్టీఫెన్ సన్, పలువురు నేతలు కే.ఆర్.ఆమోస్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేసి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.