బండి సంజయ్ తెలంగాణకు దూరం అవుతారా?

47
- Advertisement -

తెలంగాణ బీజేపీలో ఆ మద్య సంస్థాగత మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని ఆ పదవి నుంచి తప్పించి ఆ బాద్యతలను కిషన్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం. అయితే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై ఆ పార్టీ నేతలే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంలో బండి పాత్ర చాలా ఎక్కువ అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అధికార బి‌ఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏదో రకంగా పార్టీ పేరు నిత్యం ప్రజల్లో నానేలా చూసుకున్నారు బండి సంజయ్..

మరి ఈ స్థాయిలో పార్టీని బలోపేతం చేసిన ఆయనను పక్కన పెట్టేయడం.. అది కూడా ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర పరిణామమే. అయితే బండి సంజయ్ దుడుకు స్వభావం, ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు అలాగే ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడనే అభియోగాలు ఉండడంతోనే ఎన్నికల ముందు బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాద్యత ను సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డి భుజలపై వేసింది అధిస్థానం. అయితే బండికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అందుకే అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే వార్తలు వచ్చాయి. కానీ ఎవరు ఊహించని విధంగా బండి సంజయ్ ని బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి గా నియమించింది.

Also Read:సీఎం కేసీఆర్‌ని కలిసిన బ్రహ్మానందం..

అధిష్టానం. పదవి విషయంలో పై స్థాయి పదవే అయినప్పటికి బండి విషయంలో అధిష్టానం ఆలోచనలు అంతుచిక్కడం లేదు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న మరో టాక్ ఏమిటంటే బండి సంజయ్ ని ఏదో ఒక రాష్ట్రనికి పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించాలనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉందట. ఇదే గనుక నిజం అయితే బండి ని తెలంగాణకు దూరం చేసే ఆలోచనలో బీజేపీ ఉందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ బండి సంజయ్ చేసే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని దెబ్బ తీస్తాయనే ఆలోచనతోనే కమలం పెద్దలు బండి సేవలను వేరే రాష్ట్రంలో ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. మొత్తానికి బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరమే.

Also Read:Dasoju Sravan:రాష్ట్రానికి పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి

- Advertisement -