మారెడ్డి మృతి రైతు రక్షణ సమితి తీరని లోటు..

180
harish rao

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత మార్కెట్ మీటింగ్ హల్‌లో తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కీ.శే.మారెడ్డి హనుమంత రెడ్డి సంస్మరణ సభకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరైయ్యారు.

ఈ సభలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మారెడ్డి హన్మంతరెడ్డి మృతి తెలంగాణ రైతు రక్షణ సమితికే కాదు.. వ్యక్తి గతంగా నాకూ తీరని లోటు. ఆయన సర్వీసులో ఉన్నంత కాలం ఉపాధ్యాయ సమస్యలపై.. రిటైర్ అయ్యాక రైతు సమస్యలపై పోరాడారని హరీష్‌ అన్నారు.

తెలంగాణ ఉద్యమంలోనూ హనుమంత రెడ్డి తన వంతు పాత్ర పోషించారు. దాదాపు ఐదేళ్లు తెలంగాణ దీక్ష శిబిరాన్ని సిద్దిపేటలో విజయవంతంగా నిర్వహించడంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన తెలంగాణ ఉద్యమానికి, ఇటు రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేశారు అని మంత్రి హరీష్‌రావు తెలిపారు.