గిరిజన యువతకు ఉపాధికోసం కృషి: మంత్రి సత్యవతి

253
sathyavathi rathod
- Advertisement -

హైదరాబాద్: ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో గిరిజన సంక్షేమ శాఖపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, జేడీ సర్వేశ్వర్ రెడ్డి, ఐటీడీఏ పీవోలు, ఐటీడీఏ ఏపీవోలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సత్యవతి… సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు గిరిజనుల అభివృద్ధిపై అధికారులకు మార్గనిర్ధేశం చేశాం ..గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం.. సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందేలా చూడాలని ఆదేశించాం అన్నారు. కోవిడ్ సమయంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని ఆదేశించాం ….సీఎం కేసీఆర్ ఆలోచనతో ఎస్టీ ఎస్డీఎఫ్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చినా.. మరే ఇండస్ట్రీ వచ్చినా గిరిజన యువత భాగస్వామ్యం ఉండాలన్నారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం.. గిరిజన యువతకు ఉపాధి కోసం కృషి చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో 3వ ఫేజ్ విద్యుత్ కోసం రూ. 117 కోట్లు కేటాయించామన్నారు.వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 10 కోట్లతో పైలట్ ప్రాజెక్టు చెప్పట్టాలని నిర్ణయించాం
…ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద 500 కార్లను గిరిజన యువతకు అందజేశాం….సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా గిరిజన సంక్షేమ శాఖ, అధికారులు వారధులుగా ఉండాలన్నారు. ఆన్‌లైన్‌ విద్య చేరని వారి దగ్గరకు టీచర్లు వెళ్లి భోధించేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

- Advertisement -