కేటీఆర్ బాటలో ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

226
palla

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన #Gift A Smile పిలుపుకు స్పందించి, తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ ప్రజలకు ఉపయోగ పడేలా అంబులెన్స్ ను శనివారం ప్రగతి భవన్ లో ఐటీ & పురపాలక మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు.

ఈ ప్రత్యేక 108 వాహనం సేవలు మరో మూడు నుండి నాలుగు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రాబోతోందని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే లు మహేశ్ రెడ్డి, అరెక పూడి గాందీ, గువ్వల బాలరాజు , చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.