కరోనా సమయంలో అంగన్‌వాడీల కృషి భేష్: సత్యవతి

55
sathyavathi rathod

మధురా నగర్ లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో దాదాపు 58 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడ, సిసి రోడ్లను, ఆధునీకరించిన కార్యాలయాన్ని పిల్లలకు పోషకాహారాలు అందించే న్యూట్రి గార్డెన్ ను ప్రారంభించారు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె…కోవిడ్ సమయంలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పని చేశాం. ఇక్కడున్న చిన్న పిల్లలు, మహిళలకు మనం మంచి వాతావరణంలో ఉన్నామనే ఆలోచన కలిగించే విధంగా ఈ పరిసరాలను అభివృద్ధి చేయాలని నేడు ఈ కమిషనరేట్ ను ఆధునీకరించుకున్నామని తెలిపారు. దాదాపు 58 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ, అంతర్గత సీసీ రోడ్లు, న్యూట్రీ గార్డెన్, ఆధునీకరించి న కమిషనర్ ప్రాంగణం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.ఇక్కడ 600 మందికి పైగా చిన్న పిల్లలు ఉంటారు. వారికి రసాయనాలు లేని కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఇచ్చే విధంగా నేడు న్యుట్రి గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతుందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సూచనల మేరకు నేడు రాష్ట్రంలోని అంగన్వాడీ లలో కిచెన్ గార్డెన్ లు ఏర్పాటు చేసుకొని అంగన్వాడీ కి వచ్చే పిల్లలు, తల్లులు, గర్భిణి స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి కింద ఇచ్చే ఆహారం కోసం అక్కడే కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కమిషనరేట్ లో కూడా అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు పండించే న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు.

కోవిడ్ సమయంలో కూడా చిన్న పిల్లలు, మహిళలకు మన అంగన్వాడిల ద్వారా ఇచ్చే పౌష్ఠికాహారం, సేవలు ఆగవద్దని సీఎం కేసిఆర్ గారు చెప్పడంతో ఇంటింటికి అంగన్వాడీ ద్వారా సరుకులు ఇచ్చి, కావలసిన సేవలు అందించాము. ఇందుకోసం పని చేసిన మా సిబ్బంది,అధికారులకు అభినందనలు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో మహిళలు, శిశువుల సంక్షేమం, అభివృద్ధి, భద్రత కోసం అనేక కార్య్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వాటన్నిటినీ సకాలంలో లబ్ది దారులకు సరిగ్గా అందించేందుకు మా శాఖ బాగా పని చేస్తోంది….శిశువుల సంరక్షణకు కోవిడ్ సమయంలోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకొని కరోనా బారిన పడకుండా కాపాడుకున్నామని తెలిపారు.