బిగ్ బాస్ 4..అభిజిత్‌కి ఆహా అదిరే ఆఫర్‌!

58
aha

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 20న గ్రాండ్ ఫినాలే జరగనుండగా ఇందులో విజేతను ప్రకటించనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 5 గురు కంటెస్టెంట్‌లు అఖిల్,సొహైల్,అభిజిత్,అరియానా,హారిక ఉండగా ఎవరు విజేతగా నిలుస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక బిగ్ హౌస్‌లో ఉండగానే అదరిపోయే ఆఫర్ కొట్టేశారు అభిజిత్. సీజన్‌ 4లో మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్‌ టైటిల్ నెగ్గిన అభిజిత్‌కు ఓటీటీ సంస్థ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

లైఫ్ ఈజ్‌ బ్యూటిఫుల్‌తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ తర్వాత పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించాడు. ఈ నేపథ్యంలో అభిజిత్‌తో క్రేజీ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమైంది ఆహా. దీంతో పాటు స్టార్ మా కూడా ఓ టీవీ షో చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అభిజిత్ హౌస్ నుండి బయటకు రాగానే ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.