బిగ్ బాస్ 4..ఈసారి గెలిచేది మహిళలా లేక పురుషులా!

42
bigg boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించనుండగా ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు మూడు సీజన్‌లలో శివబాలాజీ,కౌశల్ మందా,రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు. ఇక సీజన్‌ 3లో రాహుల్‌కు గట్టి పోటీనిచ్చింది యాంకర్ శ్రీముఖి. అయితే చివరగా విజేతగా నిలిచింది రాహులే.

ఇక సీజన్‌ 4లో ఫినాలేకు ఐదురుగు కంటెస్టెంట్‌లు అర్హత సాధించగా వీరిలో ఇద్దరు ఆడవారు ఉన్నారు. ఒకరు హారిక కాగా మరొకరు అరియానా. మిగితా ముగ్గురు సభ్యులు అభిజిత్,అఖిల్, సొహైల్‌లకు వీరు గట్టిపోటీనిస్తుండగా ఓటింగ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు అరియానా.

అయితే ఈ సారైనా విజేతగా మహిళలు నిలుస్తారా లేదా పురుషులే విజేతగా నిలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మహిళా విజేతను ప్రకటిస్తే అరియానాకే ఎక్కువ ఛాన్స్ ఉండగా పురుషుల్లో ఒకరిని విజేతగా ప్రకటిస్తే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఏదిఏమైనా బిగ్ బాస్ నిర్వహకులకు విజేతను ప్రకటించడం సవాల్‌గా మారింది.