ఎల్లారెడ్డి పేటలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..

30
prashanth reddy

ఎల్లారెడ్డి నియోజకవర్గ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పెద్ద చెరువుకట్ట రోడ్డు పనులకు శంకుస్థాపన, పెద్ద చెరువు కట్ట బ్రిడ్జి పనులకు భూమిపూజ మరియు ఎల్లారెడ్డి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక శాసనసభ్యులు జాజాల సురేందర్‌తో పాటు జడ్పీ చైర్ పర్సన్ దాఫెదర్ శోభరాజు,కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్,పలువురు స్ధానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.