ఆచార్య సెట్స్‌లో చెర్రీ!

44
ramcharan

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ కీ రోల్ పోషిస్తుండగా తాజాగా సినిమా సెట్స్‌లో సందడి చేశారు చెర్రీ. దర్శకుడు కొరటాల శివ,ఇతర బృందాన్ని కలిసి కాసేపు ముచ్చటించారు.

ఈ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా త్వరలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం చిరు, నాయిక కాజల్‌ అగర్వాల్‌, నటుడు సోనూ సూద్‌ తదితరులపై కొరటాల కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.