రైతు ఉద్యమంపై దుష్ప్రచారం: శరద్ పవార్

32
sharad pawar

యూపీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి తనకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. మీడియాతో మాట్లాడిన పవార్…రైతుల ఉద్యమంపైనుంచి దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

యూపీఏ అధ్యక్షుడిగా తన పేరు తెరపైకి రావటంపై ఆయన గతంలోనూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మరోసారి క్లారిటీ ఇచ్చారు శరద్ పవార్. ఒకవేళ శివనసేన తన పేరును సూచిస్తే అది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం మాత్రమేనని, తనది కాదని స్పష్టం చేశారు.

యూపీఏ అధ్యక్షుడిగా శరద్‌ పవార్‌ ఎన్నికవుతారని నేననుకోవటం లేదన్నారు శరద్ పవార్. రెండు పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకుని అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ యూపీఏ అధ్యక్షుడి ఎన్నిక మాత్రమే జరుగుతుంది, ప్రధాని అభ్యర్థి ఎన్నిక కాదు అన్నారు.