ప్రతి గింజ కొంటాం: నిరంజన్ రెడ్డి

49
niranjan reddy

వానాకాలంలో వచ్చిన వరి దిగుబడిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల అంశంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

వానాకాలంలో వచ్చిన వరి దిగుబడిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతి గింజను కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు.

రైతుల మనసు కష్టపెట్టకుండా అధికారులు మసలు కోవాలని సూచించారు. రైతు లేకుంటే మనుగడ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సాగునీరు పెరిగి దిగుబడి అధికంగా వచ్చింది అన్నారు. యాసంగి పంట విషయంలో కేంద్రం ఇబ్బంది పెడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాల వల్ల తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందన్నారు. స్టోరేజ్ కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.