వాణీదేవికి పట్టం కట్టండి: నిరంజన్ రెడ్డి

162
niranjan reddy
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళలంతా తమ సోదరి సురభి వాణీదేవికి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పట్టం కట్టాలని కోరారు మంత్రులు నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ పట్టణంలో టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రులు…ఉన్నత విద్యావంతురాలైన వాణీ దేవిది మచ్చ లేని వ్యక్తిత్వమని కొనియాడారు.

మహిళలపై అపారమైన గౌరవం ఉన్న సీఎం కేసీఆర్ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉన్నత విద్యావంతురాలైన వాణీదేవికి టిక్కెట్ ఇచ్చారని పేర్కొన్నారు నిరంజన్ రెడ్డి. హైకోర్టు విభజనలో రామచందర్ రావు పాత్ర సున్నా అని… సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో అనేకమార్లు చర్చించి న్యాయమైన డిమాండ్ ను పోరాడి సాధించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

విద్యారంగంపై విశేషమైన అనుభవం ఉన్న వాణీదేవి పట్టభద్రుల కోసం నిరంతరం పనిచేస్తారని తెలిపారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతుక అంటూ కొందరు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని.. ప్రశ్నించే వాళ్లు కావాలా.. పరిష్కారం చూపే వాళ్లు కావాలో పట్టభద్రులు ఆలోచించుకోవాలన్నారు శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -