- Advertisement -
మేడ్చల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటన్నారు మంత్రి మల్లారెడ్డి. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి ఎస్విఎమ్ గ్రాండ్ హోటల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మల్లారెడ్డి…తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టాలని అన్నారు.
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకుపోవాలన్నారు. ఆ దిశగా మెజార్టీ సభ్యత్వాల సేకరణకు టీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -