లడాఖ్‌ సరిహద్దు నుండి చైనా దళాల ఉపసంహరణ..

194
india
- Advertisement -

గత 10 నెలలుగా భారత్ – చైనా సరిహద్దు ప్రాంతమైన లడాఖ్‌ నుండి భద్రతా బలగాలను క్రమక్రమంగా ఉపసంహరిస్తున్నాయి ఇరు దేశాలు. ద‌ళాలు తిరిగి వెన‌క్కి వెళ్తున్న దృశ్యాల‌ను ఇవాళ భార‌త ఆర్మీకి చెందిన నార్త‌ర్న్ క‌మాండ్ రిలీజ్ చేసింది.

ప‌లు ద‌ఫాలుగా రెండు దేశాల మ‌ధ్య సైనిక‌, దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా రెండు దేశాల సైనికులు వివాదాస్ప‌ద ప్రాంతం నుంచి వెనుదిరుగుతున్నారు. ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లోని పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద నుంచి చైనా ద‌ళాలు, ట్యాంక‌ర్లు ఉప‌సంహ‌రించాయి. దానికి సంబంధించిన ఫోటోల‌ను ఇవాళ భారత ఆర్మీ రిలీజ్ చేసింది.

గ‌త ఏడాది జూన్ 15న గ‌ల్వాన్ లోయ‌లో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన త‌ర్వాత‌.. ఇండోచైనా బోర్డ‌ర్‌లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. దీని తర్వాత చైనా యాప్‌లపై నిషేధం విధించింది భారత్.

- Advertisement -