బీజేపీవి విభజన రాజకీయాలు: మంత్రి కేటీఆర్

301
ktr

రాష్ట్రంలో బీజేపీ నేతలు విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్..రాష్ట్ర ప్రభుత్వం కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే …కేంద్రం ఉన్న రోడ్లను ముస్తుందన్నారు.

కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు 10 లేఖలు రాసిన ఉలుకు పలుకు లేదన్నారు.కేంద్రం కు రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉంది..లాక్ డౌన్ లో రాష్ట్రం పనిచేయాలని అనుకుంటే …కేంద్రం వల్ల పనులు ఆగిపోయాయని చెప్పారు.

విభజన రాజకీయాలు కాకుండా …రాష్ట్రాము కోసం బిజెపి ప్రజా ప్రతినిధులు ఏమైనా పనిచేస్తే మంచిగా ఉంటుందని సూచించారు.నాలుగు ప్రణాళికలతో హైదరాబాద్ నగరంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మిస్సింగ్, లింక్ రోడ్లను గుర్తించి అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.