KTR:420 హామిలిచ్చిన రేవంత్‌కు బుద్దిచెప్పాలి

19
- Advertisement -
ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభకు హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు.
‘కృష్ణా, గోదావరి జీవ నదులు. కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను రేవంత్‌ రెడ్డి తాకట్టు పెట్టారు. అందుకే బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఉండాలి. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్‌ ఎంపీలే. మాయమాటలు చెప్పి రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 420 హామిలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని కేటీఆర్ అన్నారు.
- Advertisement -