టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలపై కేటీఆర్‌ దిశానిర్దేశం..

28

టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలపై పార్టీ శ్రేణులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఐదవ రోజు కొనసాగాయి. పార్టీ సంస్థాగత కార్యకలాపాల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సంసిద్ధం చేసేందుకు కేటీఆర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాలకు మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ కే కేశవరావు మరియు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరియు నవంబర్ 15న జరగనున్న తెలంగాణ విజయ గర్జన సభకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేశారు.