100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

40
ktr

వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని కలియ తిరిగి పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యలు ఉండేల చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుందని, నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని విమర్శించారు. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్‌ సప్లై లేదని తెలిపారు. కేంద్రానికి ముందు చూపు లేదని తప్పుబట్టారు. ఆలోచించకుండా వ్యాక్సిన్‌ను విదేశాలకు ఇచ్చారని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.