ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా..

27

ఆంధ్రప్రదేశ్‌లో 3 శాసనమండలి సభ్యులు, తెలంగాణల 6 శాసనమండలి సభ్యుల ఎన్నికలను తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే ఈ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల నిర్వహణపై మళ్లీ సమీక్షించింది. సానుకూల పరిస్థితులు లేవు కనుక ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు మరోసారి ప్రకటించింది.

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో పరిస్థితులు ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా లేవని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 3 శాసనమండలి స్థానాలకు ఈనెల 31తో గడువు ముగియనున్నది. అలాగే తెలంగాణలో 6 శాసనమండలి స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనున్నది.