ఎంపీ సంతోష్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపిన మంత్రి కేటీఆర్..

35

రాజ్యసభ సభ్యులు టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే.తారకరామారావును కలిశారు. ఈ సందర్భంగా సోదరుడైన ఎంపీ సంతోష్ కుమార్‌కు మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల‌తో మ‌రింత కాలం ప్ర‌జాసేవ చేయాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు.