అభివృద్ధికి తపన, తపస్సులా పనిచేస్తున్నాం- స్పీకర్‌

44

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తపన, తపస్సులా పనిచేస్తున్నామని ఏపీ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అభివృద్ధి యజ్ఞంలా భావిస్తూ వ్యూహాత్మకంగా అడుగు లు వేస్తున్నామని అన్నారు. నియో జక వర్గ అభివృద్ధి ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. పొందూరు మండలం పొందూరు డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారం భించారు. పొందూరుతో పాటు తోగరాంలో డిగ్రీ కళాశాల, మహిళా వ్యవసాయ పాలిటెక్నిక్, ఆమదా లవలసలో వెటర్నరీ పాలిటెక్నిక్, పెదపేటలో ఉద్యాన పరిశోధనా కేంద్రం మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు.

పొందూరు మండలంలో బిసి రెసిడెన్షియల్ కళాశాల మంజూరు కానుందని, మద్దువలస కాలువ రానుందని, 14 ఎత్తిపోతల పథకా లు ఇంకా అనేక అభవృద్ధి పనులు రానున్నాయని ఈ సందర్భంగా వివరించారు. నియోజక వర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.పేదరికం విద్య కు ఆటంకం కారాదని, రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు వివరించారు. ప్రతీ పథకం నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి నగదు చేరుతుందన్నారు. పిల్లలు తల్లిదండ్రులకు ఆస్తి అని వారికి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని చెప్పారు. ముందుగా డిగ్రీ కళాశాల ఆవరణలో స్పీకర్, జిల్లా పరిషత్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్, తదితరులు మొక్కలు నాటారు.