రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి కేటీఆర్

69
minister

టీఆర్ఎస్‌ది రైతు ప్రభుత్వం అని…అప్పులు లేని రైతులుగా వారిని చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు మంత్రి కేటీఆర్. రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ చిత్తశుద్దితో పనిచేస్తుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2014లో రూ. ల‌క్ష వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఇచ్చిన వాగ్దానం మేర‌కు.. 35.19 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 16144.10 కోట్ల రుణాల‌ను మాఫీ చేశామ‌న్నారు.

2018లో కూడా రైతుల రుణ‌మాఫీ కోసం వాగ్దానం ఇచ్చాం అని ప్ర‌భుత్వం త‌న వాగ్దానాన్ని నిల‌బెట్టుకుందని వెల్లడించారు. రూ. 50 వేల వ‌ర‌కు రుణ‌మాఫీ ద్వారా 9 ల‌క్ష‌ల మంది రైతుల‌కు సాయం చేశామ‌ని తెలిపారు. రుణ‌మాఫీ చేసిన సీఎం కేసీఆర్‌, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డికి కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.